కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. ఇందిరా శోభన్
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ సర్కార్ ను షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉపాధి కరువై, బతుకు భారమై చికిత్స చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో నిరుపేదలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం అనివార్యమన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులపై […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ సర్కార్ ను షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఉపాధి కరువై, బతుకు భారమై చికిత్స చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో నిరుపేదలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం అనివార్యమన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
అలాగే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులపై కరోనా చికిత్స చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కరోనా పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు డబ్బు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ కమిటీ వేసి కార్పొరేట్ దోపిడీని కట్టడి చేయాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన దవాఖానలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొవిడ్ సెంటర్ల సంఖ్యను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.