మహారాష్ట్ర మంత్రికి కరోనా
మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన్ను థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో మంత్రి సహా తన కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తరువాత జరిపిన పరీక్షలో నెగెటివ్ అనే తేలింది. అయితే మంత్రి ఇటీవల మూంబ్రా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో లాక్ డౌన్‌పై సమీక్షించారు. ఈ సమావేశం నిర్వహించడం వల్లే మంత్రికి కరోనా సోకిందని అధికారులు భావిస్తున్నారు. […]
మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన్ను థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భద్రతా సిబ్బందిలో కొందరికి కరోనా సోకడంతో మంత్రి సహా తన కుటుంబ సభ్యులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తరువాత జరిపిన పరీక్షలో నెగెటివ్ అనే తేలింది. అయితే మంత్రి ఇటీవల మూంబ్రా పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో లాక్ డౌన్‌పై సమీక్షించారు. ఈ సమావేశం నిర్వహించడం వల్లే మంత్రికి కరోనా సోకిందని అధికారులు భావిస్తున్నారు. ఈ మీటింగ్‌లో పాల్గొన్న ఓ పోలీస్ అధికారికి కూడా పాజిటివ్ అని తేలింది. ఈ అధికారి తబ్లిగీ జమాత్ సభ్యుల సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొని 13 బంగ్లాదేశీయులు, 8 మంది మలేషియన్లను అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది.
Tags: maharastra, minister, avadh, carona, positive