ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థుల్లో భయం భయం

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కరోనా పాజిటివ్‌లు వైద్యులు, సిబ్బందికి సైతం వస్తుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయనేది ఊహించలేని విధంగా మారింది. కొద్దిరోజులుగా ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, ఆ కేసుల విషయంలోనూ భిన్నాభిప్రాయాలతో ఆస్పత్రుల్లో పనిచేసేందుకు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 12మందికే పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపల్ శశికళారెడ్డి చెప్పగా, 23మంది కరోనా బారినపడ్డట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే ఓ పీజీ […]

Update: 2020-06-03 10:41 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా కరోనా పాజిటివ్‌లు వైద్యులు, సిబ్బందికి సైతం వస్తుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయనేది ఊహించలేని విధంగా మారింది. కొద్దిరోజులుగా ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, ఆ కేసుల విషయంలోనూ భిన్నాభిప్రాయాలతో ఆస్పత్రుల్లో పనిచేసేందుకు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 12మందికే పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపల్ శశికళారెడ్డి చెప్పగా, 23మంది కరోనా బారినపడ్డట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. అయితే ఓ పీజీ విద్యార్థినికి పేట్లబుర్జులోని ప్రసూతి ఆస్పత్రిలో వారంక్రితం కరోనా పాజిటివ్ రాగా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్, మిగిలిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు నిమ్స్‌కు చెందిన నలుగురు డాక్టర్లకు పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా 4 రోజులుగా ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల నమూనాలు సేకరించి అధికారులు ల్యాబ్‌కు పంపుతున్నారు. అయితే ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చే నమూనాల రిపోర్టులు స్వల్ప వ్యవధిలోనే వస్తుండగా, ఉస్మానియా విద్యార్థుల రిపోర్టులు ఇంకా రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈనెల 20 నుంచి విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో వాయిదా వేస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ ఎగ్జామ్స్ పెడితే పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితి ఏంటన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఉస్మానియా ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా గుర్తించకపోవడంతో పాటు పీపీఈ కిట్లు సరఫరా చేయకపోవడం, ఇదే క్రమంలో ఇతర రోగులకు చికిత్స చేసే సమయంలో కరోనా బారిన పడుతున్నారని పలువురు అంటున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కరోనా బారిన పడిన వారిలో ఉండగా, వార్డుల్లో తిరిగే సమయంలో ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులు నామమాత్రంగా గ్లౌజులు, మాస్కులు ధరిస్తుండడం కరోనా బారిన పడడానికి కారణమౌతున్నట్లు సమాచారం. దీంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేసిన పీపీఈ కిట్లు నాసిరకంగా ఉండటం వల్లే కరోనాకు గురవుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా వైద్య విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో స్పందించిన ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రికి 4వేల ఎన్95 మాస్క్‌లను సరఫరా చేసింది.

Tags:    

Similar News