నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్

దిశ, మహబూబ్ నగర్: అధికారులు అనుమానించినట్టుగానే తెలిసిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన వ్యక్తి ఇటీవల కరోనాతో బాధపడుతూ మృత్యువాతపడ్డాడు. మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 14 మంది శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షలకు పంపించగా అందులో అదే గ్రామానికి చెందిన ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా […]

Update: 2020-06-10 03:42 GMT

దిశ, మహబూబ్ నగర్: అధికారులు అనుమానించినట్టుగానే తెలిసిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన వ్యక్తి ఇటీవల కరోనాతో బాధపడుతూ మృత్యువాతపడ్డాడు. మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 14 మంది శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షలకు పంపించగా అందులో అదే గ్రామానికి చెందిన ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా 12 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, కరోనా తీవ్రతను గుర్తించి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు దుకాణాల్లో గుంపులు గుంపులుగా ఉండకూడదని, తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.

Tags:    

Similar News