మేడారంలో కరోనా కలకలం.. అలయ సిబ్బంది ముగ్గురికి పాజిటివ్
దిశ ప్రతినిధి, వరంగల్ : వైభవంగా కొనసాగుతున్న మినీ మేడారం జాతరలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం తొమ్మిది మంది దేవాదాయశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించుకోగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. అక్కడున్న భక్తులతో పాటు జాతరకు వెళ్లి వచ్చిన వారు భయాందోళన చెందుతున్నారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గడ్, జార్ఖండ్, ఓడిషా, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. నాలుగు రోజులుగా రోజూ 30వేల మందికి పైగా […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వైభవంగా కొనసాగుతున్న మినీ మేడారం జాతరలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం తొమ్మిది మంది దేవాదాయశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించుకోగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. అక్కడున్న భక్తులతో పాటు జాతరకు వెళ్లి వచ్చిన వారు భయాందోళన చెందుతున్నారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గడ్, జార్ఖండ్, ఓడిషా, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. నాలుగు రోజులుగా రోజూ 30వేల మందికి పైగా వనదేవతలను భక్తులు దర్శనం చేసుకుంటూ మొక్కులు అప్పజెప్పుతున్నారు. క్యూలైన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.భక్తులు మాస్కులు ధరించకపోవడం, సామాజికదూరం పాటించకపోవడం గమనార్హం. ఈ సారి మినీ మేడారం జాతర ఆరంభానికి ముందు పదిరోజుల నుంచే రోజూ పదివేల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకోవడం విశేషం.
మేడారంలో కేసులు పెరుగుతాయా…?
కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో మేడారంలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అలర్టయింది. వెంటనే మెగా క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ముందుగా అనుమానిత లక్షణాలున్న స్థానిక వ్యాపారులకు, గ్రామ ప్రజలకు నిర్వహించాలని భావిస్తోంది. అయితే లక్షణాలు వెంటనే బయటపడవు కాబట్టి మేడారంలో కరోనా వ్యాప్తి ఉంటుందా..? ఉంటే ఉంటుంది..? ఎలా ఉండబోతోందన్న విషయాలపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.
లక్షణాలుంటే గడప దాటొద్దు : డీఎంహెచ్‌వో ఆలెం అప్పయ్య
జాతరకు హాజరైన వారిలో కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు. సాధ్యమైనంత వరకు ప్రత్యేక గదిలోనే ఉండేందుకు ప్రయత్నించాలి. ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఇక మేడారం జాతరలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి, గ్రామ ప్రజలకు ముందుగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాం. రేపటి నుంచే మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. రోజూ 400లకు పైగా పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైతే పెంచుతామంటూ డీఎంఅండ్‌హెచ్‌వో ఆలెం అప్పయ్య దిశ ప్రతినిధికి వివరించారు.