తమిళనాడు ఎమ్మెల్యే అభ్యర్థులకు కరోనా పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదౌతు విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన మహారాష్ట్ర, తమిళనాడు, హైదరాబాద్, బెంగళూరులో భయంకరంగా వ్యాప్తిచెందుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరికీ సోకి పంజా విసురుతోంది. తాజాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అన్నాడీఎంకే అభ్యర్థ్ధి, మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, డీఎంకే అభ్యర్థి కేఎస్ మూర్తిలకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దిండుగల్ జిల్లా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదౌతు విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన మహారాష్ట్ర, తమిళనాడు, హైదరాబాద్, బెంగళూరులో భయంకరంగా వ్యాప్తిచెందుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరికీ సోకి పంజా విసురుతోంది. తాజాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అన్నాడీఎంకే అభ్యర్థ్ధి, మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, డీఎంకే అభ్యర్థి కేఎస్ మూర్తిలకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దిండుగల్ జిల్లా సానార్‌పట్టికి చెందిన అన్నాడీఎంకే మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నత్తం నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీచేశారు. అదే విధంగా, నామక్కల్ జిల్లా పరమత్తివేలూరు నియోజకవర్గంలో పోటీచేసిన డీఎంకే అభ్యర్థి కేఎస్ మూర్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలియడంతో ఆయనను కోయం బత్తూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.