జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా తగ్గిపోయిందనుకోని చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు. కొంత మంది అసలు మాస్క్‌నే యూజ్ చేయట్లేదు. ఈ క్రమంలో తాజాగా సంగారెడ్డిజిల్లాలోని మహాత్మజ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ముత్తంగి గ్రామంలోని జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది. కాలేజీ యాజమాన్యం కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కసారిగా 43 మంది విద్యార్థులకు, ఒక లెక్చరర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా తగ్గిపోయిందనుకోని చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు. కొంత మంది అసలు మాస్క్‌నే యూజ్ చేయట్లేదు. ఈ క్రమంలో తాజాగా సంగారెడ్డిజిల్లాలోని మహాత్మజ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ముత్తంగి గ్రామంలోని జ్యోతిరావు పూలే ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది. కాలేజీ యాజమాన్యం కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కసారిగా 43 మంది విద్యార్థులకు, ఒక లెక్చరర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిని కాలేజీలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు వీరితో క్లోజ్‌గా ఉన్నవారికి కూడా మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఘటనతో కరోనా పోయిందని కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిచడంతో మళ్లీ కరోనా విజృంభించే అవకాశం ఉందని అందువలన అందరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు.