ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌కు కరోనా

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన శాసన మండలి సభ్యులు వి. గంగాధర్ గౌడ్ కు కరోనా సోకింది. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ అని తేలింది. పరీక్షల్లో గన్ మెన్, డ్రైవర్, కోడలికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. శనివారం నిమ్స్ లో పరీక్ష చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హోం క్వారన్ టైన్ లోకి వెళ్లిపోయారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజీ రెడ్డి […]

Update: 2020-08-09 02:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన శాసన మండలి సభ్యులు వి. గంగాధర్ గౌడ్ కు కరోనా సోకింది. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ అని తేలింది. పరీక్షల్లో గన్ మెన్, డ్రైవర్, కోడలికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. శనివారం నిమ్స్ లో పరీక్ష చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హోం క్వారన్ టైన్ లోకి వెళ్లిపోయారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజీ రెడ్డి గోవర్ధన్ కు పాజిటివ్ వచ్చినప్పుడు వీజీ గౌడ్ కూడా ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నారని పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిన విషయం విధితమే.

Tags:    

Similar News