ఊరంతా లాక్‌డౌన్.. ఆ కార్యమే కారణమా?

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఓ గ్రామంలో 45 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యం జరిగిన తర్వాత కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన ఘటన నిజమాబాద్ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో వారంరోజుల క్రితం ఓ శుభకార్యం జరిగింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే 45 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొంత మంది మ‌హారాష్ట్ర […]

Update: 2021-06-06 23:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఓ గ్రామంలో 45 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యం జరిగిన తర్వాత కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన ఘటన నిజమాబాద్ జిల్లా నందిపేట మండలం కంఠం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో వారంరోజుల క్రితం ఓ శుభకార్యం జరిగింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే 45 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొంత మంది మ‌హారాష్ట్ర నుంచి ఈ శుభ‌కార్యానికి హాజరయ్యారు. అయితే వారి నుంచే క‌రోనా వ్యాప్తి చెందిన‌ట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఓకే కుటుంబంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.

Tags:    

Similar News