ఖ‌మ్మంలో ఐదుకు చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం రాత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుద‌లైన హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఆదివారం కొత్త‌గా మ‌రో పాజిటివ్ కేసు నమోదైన‌ట్లుగా బులిటెన్‌లో వెల్లడించింది. అయితే ఎక్క‌డి వ్య‌క్తి అన్న‌ది స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇంత‌కు ముందు జిల్లాలో పెద్ద‌తండావాసి, అత‌నితో స‌న్నిహితంగా మెదిలిన మోతీన‌గ‌ర్‌కు చెందిన వ్య‌క్తికి పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అలాగే ప‌ట్ట‌ణంలోని ఖిలా బ‌జార్‌కు చెందిన ఓ […]

Update: 2020-04-12 09:58 GMT

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం రాత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుద‌లైన హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఆదివారం కొత్త‌గా మ‌రో పాజిటివ్ కేసు నమోదైన‌ట్లుగా బులిటెన్‌లో వెల్లడించింది. అయితే ఎక్క‌డి వ్య‌క్తి అన్న‌ది స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇంత‌కు ముందు జిల్లాలో పెద్ద‌తండావాసి, అత‌నితో స‌న్నిహితంగా మెదిలిన మోతీన‌గ‌ర్‌కు చెందిన వ్య‌క్తికి పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అలాగే ప‌ట్ట‌ణంలోని ఖిలా బ‌జార్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కాగా.. అనంతరం రెండు రోజుల వ్య‌వ‌ధిలో అతడి కోడ‌లుకు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. తాజాగా ఆదివారం కూడా మ‌రో కేసు పాజిటివ్ రావ‌డంతో అధికార యంత్రాంగం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. జిల్లాలో 302మంది ర‌క్త‌న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌ల‌కు పంపిచండం జ‌రిగింద‌ని డీఎంహెచ్‌వో హెల్త్‌బులిటెన్‌లో తెలిపారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 207మంది ఫ‌లితాలు రాగా ఇందులో ఐదుగురికి పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. ఇంకా 97మందికి సంబంధించిన ఫ‌లితాలు రావాల్సి ఉంద‌న్నారు. అయితే ఆదివారం ఒక్క‌రోజే దాదాపు 27మంది ర‌క్త‌న‌మూనాల‌ను సేక‌రించిన‌ట్లు డీఎంహెచ్‌వో మాల‌తి బులిటెన్‌లో స్పష్టం చేశారు.

tag: corona positive cases, reaching, five, Khammam

Tags:    

Similar News