ఏపీలో కరోనా @ 363

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజుకో రీతిన బయటపడుతోంది. ఒకరోజు ఒక్క కేసూ నమోదు కాలేదనుకుంటే.. మరుసటి రోజు పదుల సంఖ్యలో సోకుతూ కరోనా మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో వైద్యఆరోగ్య శాఖాధికారులు గత నెల రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడిపేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనాను ఎలా కట్టడిచేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నారు. మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో వైద్యారోగ్యశాఖ […]

Update: 2020-04-10 03:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజుకో రీతిన బయటపడుతోంది. ఒకరోజు ఒక్క కేసూ నమోదు కాలేదనుకుంటే.. మరుసటి రోజు పదుల సంఖ్యలో సోకుతూ కరోనా మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో వైద్యఆరోగ్య శాఖాధికారులు గత నెల రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడిపేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనాను ఎలా కట్టడిచేయాలో తెలీక ఇబ్బంది పడుతున్నారు.

మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో వైద్యారోగ్యశాఖ కాస్త ఊపిరిపీల్చుకునే వెసులుబాటు కలిగింది. ఇంతలోనే నిన్న సాయంత్రానికి కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363కి పెరిగింది. కొత్తగా నమోదైన 15 కేసుల్లో 11 కేసులు ప్రకాశం జిల్లాలోనే నమోదు కావడం విశేషం. గుంటూరులో 2, తూర్పు గోదావరి జిల్లాలో 1, కడప జిల్లాలో 1 పాజిటివ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు.

మరోవైపు కరోనా కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కరోనా సోకి, చికిత్స పొందుతూ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పదికి చేరింది.

Tags: coronavirus, covid-19, andhra pradesh, health department, amaravathi

Tags:    

Similar News