దేశంలో కరోనా రికార్డు.. ఒకేరోజు 10,956 కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,956 కేసులు నమోదు కాగా, 396 మంది చనిపోయారు. భారత్‌లో కరోనా వైరస్ కేసులు మొదలైన రోజు నుంచి ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2,97,535 […]
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో నమోదు అవుతూ.. విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,956 కేసులు నమోదు కాగా, 396 మంది చనిపోయారు. భారత్‌లో కరోనా వైరస్ కేసులు మొదలైన రోజు నుంచి ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2,97,535 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో 8498మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశంలో జూన్ నెలలో రోజుకు సుమారు 9 నుండి 10 వేల కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి.