భద్రాద్రిలో కరోనా కలకలం.. విద్యార్థులు, టీచర్‌కు కరోనా

దిశ, టేకులపల్లి : కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధిలోని దంతెల తండా MPPS పాఠశాలలో నలుగురు విద్యార్థులు, అంగన్వాడీ స్కూల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం దంతెల తండా స్కూల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ తేలిందని మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్, స్టూడెంట్స్‌కు కరోనా పాజిటివ్ రావడంతో శనివారం స్కూల్‌లోని 29 మంది విద్యార్థులు,  టీచర్‌కు కొవిడ్ […]

Update: 2021-09-25 06:55 GMT

దిశ, టేకులపల్లి : కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ పరిధిలోని దంతెల తండా MPPS పాఠశాలలో నలుగురు విద్యార్థులు, అంగన్వాడీ స్కూల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం దంతెల తండా స్కూల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ తేలిందని మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు.

అంగన్వాడీ టీచర్, స్టూడెంట్స్‌కు కరోనా పాజిటివ్ రావడంతో శనివారం స్కూల్‌లోని 29 మంది విద్యార్థులు, టీచర్‌కు కొవిడ్ పరీక్షలు చేయించామన్నారు. ఈ పరీక్షలో నలుగురు విద్యార్థులు, టీచర్‌కు పాజిటివ్ వచ్చిందని వివరించారు. విషయం తెలియడంతో డీఈవో సోమశేఖర వర్మ పాఠశాలను సందర్శించి మండల ఆఫీసర్లకు, విద్యార్థులకు జాగ్రత్తలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో ఠాకూర్రాం సింగ్, కోయగూడెం సర్పంచ్ పూనెం ఉమా, మండల ఆఫీసర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News