ఏపీలో 5లక్షల 75వేలు దాటిన కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 61,529 మందికి పరీక్షలు నిర్వహించగా 7,956మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. 60మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 4,972గా ఉంది. ప్రస్తుతం 93,204 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4,76,903 మంది డిశ్చార్జీ అయ్యారు. తాజాగా 9,764మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46.61మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. గడిచిన 24గంటల్లో 61,529 మందికి పరీక్షలు నిర్వహించగా 7,956మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. 60మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 4,972గా ఉంది. ప్రస్తుతం 93,204 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 4,76,903 మంది డిశ్చార్జీ అయ్యారు. తాజాగా 9,764మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46.61మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా వైరస్ బారిన పడి చిత్తూరు జిల్లాలో 9మంది ప్రాణాలు కోల్పోగా అనంతపురంలో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, విశాఖ జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో 483 కరోనా పాజిటివ్ కేసులు రాగా చిత్తూరులో 748, తూర్పుగోదావరిలో 1,412, గుంటూరులో 666, కడపలో 326, కృష్ణా జిల్లాలో 201, కర్నూలులో 341, నెల్లూరులో 756, ప్రకాశం 444, శ్రీకాకుళంలో 517, విశాఖపట్నంలో 490, విజయనగరంలో 481, పశ్చిమగోదావరిలో 1,091 కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Read Also..