ఏపీలో 3లక్షలు దాటిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రతిరోజు దాదాపు 10వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56,090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,652 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షల 6వేల 261కి చేరింది. ఇవాళ 88మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,820గా ఉంది. తాజాగా కరోనా బారినపడిన వారు 9,211 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా […]

Update: 2020-08-18 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రతిరోజు దాదాపు 10వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56,090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,652 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షల 6వేల 261కి చేరింది. ఇవాళ 88మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,820గా ఉంది. తాజాగా కరోనా బారినపడిన వారు 9,211 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా మహమ్మారితో తాజాగా చిత్తూరు జిల్లాలో 14మంది ప్రాణాలు కోల్పోగా , ప్రకాశం జిల్లాలో 11మంది, అనంతపురంలో 9మంది, గుంటూరులో 9మంది, కర్నూలులో 9మంది, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఒకరు మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది.

అనంతపురం జిల్లాలో 445 మందికి కరోనా పాజిటివ్ సోకగా, చిత్తూరులో 990, తూర్పుగోదావరిలో 1,396, గుంటూరులో 895, కడపలో 755, కృష్ణా జిల్లాలో 281, కర్నూలులో 830, నెల్లూరులో 684, ప్రకాశంలో 725, శ్రీకాకుళంలో 405, విశాఖపట్నంలో 928, పశ్చిమ గోదావరి జిల్లాలో 805 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 85,130 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 2లక్షల 18వేల 311 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 29 లక్షల 31 వేల 611 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ఏపీ సర్కార్ తెలిపింది.

Tags:    

Similar News