జనగామలో మరో పాజిటివ్

దిశ, వరంగల్: జనగామజిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలోని పెన్షన్ సెక్షన్ విభాగంలో పనిచేస్తున్న ఖాజా మొహిదొద్దీన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్దారించారు. ఈనెల 17న ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు హాజరై జనగామకు చేరుకున్నారు. అతన్ని ఈ నెల 31న వరంగల్ ఎంజీఎంకు తరలించి పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్టు వరంగల్ గాంధీ వైద్యులు వెల్లడించారు. దీంతో జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో నివాసముంటున్న ఆయన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు, మేనల్లుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం […]

Update: 2020-04-03 08:39 GMT

దిశ, వరంగల్: జనగామజిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలోని పెన్షన్ సెక్షన్ విభాగంలో పనిచేస్తున్న ఖాజా మొహిదొద్దీన్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్దారించారు. ఈనెల 17న ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు హాజరై జనగామకు చేరుకున్నారు. అతన్ని ఈ నెల 31న వరంగల్ ఎంజీఎంకు తరలించి పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్టు వరంగల్ గాంధీ వైద్యులు వెల్లడించారు. దీంతో జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో నివాసముంటున్న ఆయన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు, మేనల్లుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గిర్నిగడ్డలోని సుమారు 60 కుటుంబాలను ఐసోలేషన్‌లోనే ఉంచాలని వైద్యులు నిర్ణయించినట్టు సమాచారం. జిల్లాలో 2రోజుల వ్యవధిలో 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో 79మందిని మందిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని క్వారంటైన్‌కు తరలించారు.

Tags: corona positive, janagama dist, lockdown

Tags:    

Similar News