కరోనా పాజిటివ్ ప్రాంతాలు.. ఇక కంటోన్మెంట్ జోన్లు

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివాసం ఉంటున్న ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్‌లుగా గుర్తించినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సీపీ కార్తికేయతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ జోన్ పరిధిలో కిలో మీటరు మేరకు పారిశుధ్య పనులు, అనుమానితులను గుర్తించి పరీక్షలు చేస్తామన్నారు. జిల్లాలో 16 పాజిటివ్ కేసులు వచ్చాయని, బాధితులకు ప్రైమరీగా 305 మంది, సెకండరీగా 293 మందిని గుర్తించామన్నారు. ఈరోజు 93 మందిని క్వారంటైన్‌కు […]

Update: 2020-04-04 04:37 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివాసం ఉంటున్న ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్‌లుగా గుర్తించినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సీపీ కార్తికేయతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ జోన్ పరిధిలో కిలో మీటరు మేరకు పారిశుధ్య పనులు, అనుమానితులను గుర్తించి పరీక్షలు చేస్తామన్నారు. జిల్లాలో 16 పాజిటివ్ కేసులు వచ్చాయని, బాధితులకు ప్రైమరీగా 305 మంది, సెకండరీగా 293 మందిని గుర్తించామన్నారు. ఈరోజు 93 మందిని క్వారంటైన్‌కు తరలించినట్టు వివరించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అనుమానితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారన్నారు. ఇప్పటికే అతని నమూనాలను సేకరించినట్టు
తెలిపారు. జిల్లాలో 3673 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉండగా, ప్రభుత్వ క్వారంటైన్‌లో 174 మంది ఉన్నారని, వారిలో 43 మందికి పరీక్షలు నిర్వహించామని, రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ మర్కజ్ వెళ్లిన 56 మందిని గుర్తించామని, ఇందులో ఎవరైనా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు జిల్లా జనరల్ ఆసుపత్రి‌లో స్వయంగా సంప్రదించాలని కోరారు. కొవిడ్ నియంత్రణకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందగా స్వీయ నిర్బంధంలో ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీ కార్తికేయ మాట్లాడుతూ అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 1900 వాహనాలు సీజ్ చేసి, 51 మందిపై లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామన్నారు. జనరల్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి, సర్వేను అడ్డుకున్న వారిపై కూడా కేసులు నమోదు చేశామన్నారు.


tags: corona, lockdown, positive case area, cantonment

Tags:    

Similar News