కంగారు పెట్టిస్తున్న తెలంగాణ కరోనా లెక్కలు
దిశ, వెబ్‌డెస్క్: ఒకరోజు 6, తర్వాతి రోజు 2… రెండ్రోజులకు వెంటనే 17, మొన్న 22, నిన్న 21… లాటరీలో నెంబర్లు కూడా ఇంత ర్యాండమ్‌గా రావు. కానీ తెలంగాణలో కరోనా కేసులు మాత్రం రోజుకో రకంగా మారుతున్నాయి. అయితే ఈ కేసులకు సంబంధించి లోతైన డేటాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డేటా కొన్ని ఆందోళనకర విషయాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 40 శాతం కేసులు 21 నుంచి 40 ఏళ్ల మధ్యనే ఉన్నారని డేటా […]
దిశ, వెబ్‌డెస్క్: ఒకరోజు 6, తర్వాతి రోజు 2… రెండ్రోజులకు వెంటనే 17, మొన్న 22, నిన్న 21… లాటరీలో నెంబర్లు కూడా ఇంత ర్యాండమ్‌గా రావు. కానీ తెలంగాణలో కరోనా కేసులు మాత్రం రోజుకో రకంగా మారుతున్నాయి. అయితే ఈ కేసులకు సంబంధించి లోతైన డేటాను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డేటా కొన్ని ఆందోళనకర విషయాలు కూడా ఉన్నాయి.
తెలంగాణలో దాదాపు 40 శాతం కేసులు 21 నుంచి 40 ఏళ్ల మధ్యనే ఉన్నారని డేటా చెబుతోంది. కరోనా ఎక్కువగా వృద్ధులు, పిల్లలకే ఎక్కువగా సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తెలంగాణలో కొద్దిగా విభిన్నంగా ఉండటం ఆందోళనకరమే. వీరిలో ముఖ్యంగా 21 నుంచి 30 ఏళ్ల వాళ్లు 1061 అంటే 21 శాతం ఉన్నారు. అలాగే 41-60 ఏళ్ల వాళ్లు 29 శాతం, 61-70 ఏళ్ల వాళ్లు 7 శాతం మాత్రమే ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక లింగం ఆధారంగా చూస్తే ఇక్కడ 65.5 శాతం (705) మగవాళ్లకు కరోనా సోకగా, 33.5 శాతం (365) ఆడవాళ్లు ఉన్నారు. వీటితో పాటు రికవరీ రేటు 47 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.
Tags: corona telangana, covid, corona, statistics, male, female, ratio, recovery rate