తెలంగాణలో తొలి బాధితుడికి తగ్గిన కరోనా
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే విషయం ఇది. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. తన విధుల్లో భాగంగా దుబాయి వెళ్లిన 24 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో స్వరాష్ట్రం తెలంగాణకు వచ్చారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ హాస్పిటల్‌లోని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స అందించడంతో బాధితుడికి కరోనా వైరస్ దాదాపు తగ్గిపోయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల […]
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే విషయం ఇది. రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. తన విధుల్లో భాగంగా దుబాయి వెళ్లిన 24 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరుకు చేరుకున్నారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో స్వరాష్ట్రం తెలంగాణకు వచ్చారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ హాస్పిటల్‌లోని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స అందించడంతో బాధితుడికి కరోనా వైరస్ దాదాపు తగ్గిపోయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో గాంధీ హాస్పిటల్ వైద్యుల చికిత్సా విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వస్తే చనిపోతారని ఇప్పటివరకు ఉన్న అపోహను గాంధీ వైద్యులు పటాపంచలు చేశారు.
tags:corona, covid-19, gandhi hospital, etela rajender, health minister, corona reduced, techie