మూడు గంటలుగా నడిరోడ్డు పైనే మృతదేహం..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పుణ్యమా అని మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా కరోనా అనుకుని సొంతింటి వారే దగ్గరికి రావడానికి సంకోచిస్తున్నారు. అయితే, పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లేందుకు అని బయటకు రాగా నడిరోడ్డు పైనే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని తీసుకు పోవడానికి బంధువులు కూడా వెనకడుగేశారు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఇదివరకే టెస్టులు చేయించుకుని కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా పుణ్యమా అని మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా కరోనా అనుకుని సొంతింటి వారే దగ్గరికి రావడానికి సంకోచిస్తున్నారు. అయితే, పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లేందుకు అని బయటకు రాగా నడిరోడ్డు పైనే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని తీసుకు పోవడానికి బంధువులు కూడా వెనకడుగేశారు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఇదివరకే టెస్టులు చేయించుకుని కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయి ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో 3గంటలకు పైగా కరోనా మృతదేహం రోడ్డుపైనే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన చూసిన వారంతా ఈలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకున్నారంటే కరోనా మానవసంబంధాలను ఎలా దూరం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.