యశోదా ఆసుపత్రిలో మరో దారుణం

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న స్టీవెన్ రాజ్ కుమార్ (49) కరోనా(corona)తో గత నెల 20న యశోదా ఆసుపత్రిలో చేరాడు. చికిత్సపొందుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి 9గంటలకు చనిపోయాడు. చికిత్స కోసం రూ.12 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే బ్యాలెన్స్ రూ. 8లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని(deadbody) బంధువులు అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. బాధితుడు చనిపోయి 40 గంటలు గడుస్తున్నా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు […]

Update: 2020-08-14 04:49 GMT

దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న స్టీవెన్ రాజ్ కుమార్ (49) కరోనా(corona)తో గత నెల 20న యశోదా ఆసుపత్రిలో చేరాడు. చికిత్సపొందుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి 9గంటలకు చనిపోయాడు. చికిత్స కోసం రూ.12 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే బ్యాలెన్స్ రూ. 8లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని(deadbody) బంధువులు అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది.

బాధితుడు చనిపోయి 40 గంటలు గడుస్తున్నా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించలేదు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రి యాజమాన్యం తీరుపై డీఎంఅండ్‌హెచ్ ఓ‌కు ఫిర్యాదు చేశారు. అయిన బాధితులకు న్యాయం జరగడంలేదు. మృతదేహం కోసం బంధువులు ఆసుపత్రి ఎదుట పడిగాపులు కాస్తున్నారు.

Tags:    

Similar News