‘లాక్ డౌన్‌తోనే కరోనా నియంత్రణ’
దిశ, మేడ్చల్: లాక్ డౌన్‌ను విధిగా పాటించడంతోనే కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి మున్సిపాలిటీలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. అలాగే, […]
దిశ, మేడ్చల్: లాక్ డౌన్‌ను విధిగా పాటించడంతోనే కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించగలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి మున్సిపాలిటీలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. అలాగే, ప్రజలెవరూ అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Tags: lockdown, corona, minister malla reddy, medchal, quthbullapur, collector vivekananda,