తబ్లీగీ జమాత్… విశేషాలివే!

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో తబ్లీగీ జమాత్ కారణంగా ఇప్పుడు దేశమంతా మ్యాన్ హంట్ మొదలైంది. కరోనా వైరస్ సోకిందనుకుంటున్న వ్యక్తులందరినీ అంగుళం అంగుళం వెతికి పట్టుకుంటున్నారు. అయితే ఈ తబ్లీగీ జమాత్ అంటే ఏంటి? ఎందుకు అంత మంది అక్కడికి వెళ్లారు? అనే విషయాలు తెలుసుకుందాం. దాదాపు 93 ఏళ్ల క్రితం తబ్లీగీ జమాత్ లేదా ద సొసైటీ ఫర్ స్ప్రెడింగ్ ఫెయిత్ ఏర్పాటైంది. ఇస్లాం మతంలో తటస్థ ఆధ్యాత్మిక భావనలను ప్రచారం చేసే ఉద్దేశంతో మేవార్‌లో […]

Update: 2020-04-01 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్:
ఢిల్లీలో తబ్లీగీ జమాత్ కారణంగా ఇప్పుడు దేశమంతా మ్యాన్ హంట్ మొదలైంది. కరోనా వైరస్ సోకిందనుకుంటున్న వ్యక్తులందరినీ అంగుళం అంగుళం వెతికి పట్టుకుంటున్నారు. అయితే ఈ తబ్లీగీ జమాత్ అంటే ఏంటి? ఎందుకు అంత మంది అక్కడికి వెళ్లారు? అనే విషయాలు తెలుసుకుందాం.

దాదాపు 93 ఏళ్ల క్రితం తబ్లీగీ జమాత్ లేదా ద సొసైటీ ఫర్ స్ప్రెడింగ్ ఫెయిత్ ఏర్పాటైంది. ఇస్లాం మతంలో తటస్థ ఆధ్యాత్మిక భావనలను ప్రచారం చేసే ఉద్దేశంతో మేవార్‌లో మహమ్మద్ ఇలియాస్ అల్ కాంద్లావీ దీన్ని ఏర్పాటు చేశారు. దేవబందీ ఉద్యమం తర్వాత మతాంతరీకరణ ద్వారా జిహాద్ ఆధ్యాత్మిక భావనను పెంపొందించడం తబ్లీగీ జమాత్ ముఖ్య ఉద్దేశం. అయితే దక్షిణాసియా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ భారత సెక్యూరిటీ ఏజెన్సీల దృష్టిలో కూడా ఉంది.

నిజాముద్దీన్‌లో ఉన్న ప్రధాన కార్యాలయం నుంచి తబ్లీగి జమాత్ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థకు అలామీ మర్కజ్ బంగ్లేవాలీ మజీద్, మరో 6 అంతస్తుల డార్మిటరీ ఉంది. వీటిలో దాదాపు 2000ల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం మీద ఇక్కడికి వివిధ దేశాల నుంచి ముస్లింలు హాజరై, మత ప్రచారం కోసం వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడికి ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కిర్గిస్తాన్ నుంచి ముస్లింలు హాజరవుతారు.

Tags: Tablighi Jamaat, Muslims, Social Service, Corona, Covid

Tags:    

Similar News