‘పాలమూరులో రెండో దశకు కరోనా’
దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణకు అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పాలమూరు జిల్లాలో కరోనా వ్యాప్తి రెండో దశకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరిందని, అందులో ఐదుగురూ జిల్లా కేంద్రానికి చెందిన వారేనని వివరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి జిల్లాకు 350మంది రాగా, […]
దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణకు అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పాలమూరు జిల్లాలో కరోనా వ్యాప్తి రెండో దశకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరిందని, అందులో ఐదుగురూ జిల్లా కేంద్రానికి చెందిన వారేనని వివరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి జిల్లాకు 350మంది రాగా, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 14వేల మందికిపైగా వచ్చారని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా వీరందరూ క్వారంటైన్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవడం వల్లే కేసులను అదుపులో పెట్టగలిగామన్నారు. నమోదైన ఏడు కేసుల్లో (జడ్చర్లలో రెండు, జిల్లా కేంద్రంలో ఐదు) ఐదు కేసుల్లోనూ బాధితులు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారేనని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు గుంపులుగా ఉంటే వెంటనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
tags:corona outbreak, second stage, excise minister srinivas goud, mahabubnagar, delhi markaz,