కరోనా? జలుబా?.. అది చెప్పేస్తుంది!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 లక్షణాలు, సాధారణ జలుబు లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉండటంతో చిన్న తుమ్ము వచ్చినా సరే జనాలు భయంతో డాక్టర్‌‌ దగ్గరికి పరిగెత్తుతున్నారు. ఇప్పటికే ఉన్న పేషెంట్లతో డాక్టర్లు విరామం లేకుండా పనిచేస్తుంటే భయంతో వచ్చిన వారిని పరీక్షించడానికి సమయం దొరకట్లేదు. దీంతో వారికి వచ్చింది కరోనానా లేక సాధారణ జలుబా అనే విషయం తేల్చుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే వారికి సహాయపడే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ని సిడ్నీలోని […]

Update: 2020-03-26 02:05 GMT

దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 లక్షణాలు, సాధారణ జలుబు లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉండటంతో చిన్న తుమ్ము వచ్చినా సరే జనాలు భయంతో డాక్టర్‌‌ దగ్గరికి పరిగెత్తుతున్నారు. ఇప్పటికే ఉన్న పేషెంట్లతో డాక్టర్లు విరామం లేకుండా పనిచేస్తుంటే భయంతో వచ్చిన వారిని పరీక్షించడానికి సమయం దొరకట్లేదు. దీంతో వారికి వచ్చింది కరోనానా లేక సాధారణ జలుబా అనే విషయం తేల్చుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

అయితే వారికి సహాయపడే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ని సిడ్నీలోని మెడియస్ హెల్త్ అనే స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. భారతీయుడైన అభి భాటియా ఈ సంస్థను నడిపిస్తున్నాడు. వారు తయారు చేసిన రిస్క్ అసెస్‌మెంట్ టూల్‌కి క్వోరో అని పేరు పెట్టారు. ఎలాంటి సైనిన్ లేకుండా క్వోరో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి కరోనా పరీక్ష చేయించుకోవాలా వద్దా అనే ప్రశ్నకు ఇంటి దగ్గర ఉండే సమాధానం తెలుసుకోవచ్చు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఆరోగ్య స్థితికి సంబంధించిన ప్రశ్నలు క్వోరో అడుగుతుంది. వీటిలో ట్రావెల్ హిస్టరీ, లక్షణాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయని అభి భాటియా వివరించారు. ఈ టూల్ ద్వారా జనాల్లో భయాన్ని తగ్గించి, డాక్టర్ల పని భారం పెంచకుండా ఉండే అవకాశం కల్పిస్తోందని అభి తెలిపారు.

Tags: Corona, COVID 19, Quoro, Questions, Influenza, Medius Health

Tags:    

Similar News