సీఎం కేసీఆర్‌కు కరోనా.. విలేఖరిపై కేసు

దిశ, ఖమ్మం: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. రాష్ట్ర మంత్రులను సైతం ఎవరనీ వదలకుండా అందరి అంతు చూస్తోంది. అయితే తాజాగా ప్రగతి భవన్‌లో కరోనా పాజిటివ్ కలకలం రేపడం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆ‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇటీవల ఓ పత్రికలో కథనం ప్రచురితం అయ్యింది. అయితే అది తప్పుడు ప్రచారం అని, సీఎం కేసీఆర్‌కు కరోనా రాలేదని, వార్త ప్రచురించిన ఆదాబ్ హైద‌రాబాద్ యాజ‌మాన్యంపై టీఆర్ఎస్ కార్యకర్త జూబ్లీహిల్స్ పోలీస్ […]

Update: 2020-07-06 05:54 GMT

దిశ, ఖమ్మం: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. రాష్ట్ర మంత్రులను సైతం ఎవరనీ వదలకుండా అందరి అంతు చూస్తోంది. అయితే తాజాగా ప్రగతి భవన్‌లో కరోనా పాజిటివ్ కలకలం రేపడం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆ‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇటీవల ఓ పత్రికలో కథనం ప్రచురితం అయ్యింది. అయితే అది తప్పుడు ప్రచారం అని, సీఎం కేసీఆర్‌కు కరోనా రాలేదని, వార్త ప్రచురించిన ఆదాబ్ హైద‌రాబాద్ యాజ‌మాన్యంపై టీఆర్ఎస్ కార్యకర్త జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వార్త రాసిన రిపోర్టర్ ఆనం చిన్ని వెంక‌టేశ్వ‌ర్లును జూబ్లిహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదాబ్ హైదరాబాద్ ఈ-పేపర్లో రెండ్రోజుల క్రితం ‘‘సీఎం కేసీఆర్‌కు కరోనా’’, ‘‘హరితహారం కార్యక్రమంలో సోకిందా’’? అంటూ వార్త ప్ర‌చురితం కావ‌డం టీఆర్‌ఎస్ శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది. కేసీఆర్ ఆరోగ్యంపై ఎక్క‌డా, అధికారులు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని తెలుసుకున్న హైద‌రాబాద్‌లోని ర‌హ‌మ‌త్ న‌గ‌ర్‌కు చెందిన మహ్మద్ ఇలియాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆదాబ్ హైద‌రాబాద్ మీడియా సంస్థ‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ముఖ్య‌మంత్రి జలుబు, తదితర లక్షణాలతో బాధపడుతున్నాడని, క్వారంటైన్‌లో చికిత్స అని, ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా అంటూ నిరాధారిత వార్త రాయడంపై ఇలియాస్, ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు రిపోర్టర్ ఆనం చిన్ని వెంకటేశ్వరరావుతో పాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్ కిడ్నాప్ అంటూ హైరానా…

ఖ‌మ్మంలో నివాసం ఉండే ఆదాబ్ హైద‌రాబాద్ ప‌త్రిక విలేఖ‌రి ఆనం చిన్ని వెంక‌టేశ్వ‌ర్లు కిడ్నాప్ అంటూ సోమ‌వారం ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. ఖ‌మ్మంలోని త‌న నివాసం నుంచి వాకింగ్‌కు బ‌య‌ల్దేరిన ఆయ‌న ఉద‌యం 9గంట‌ల‌కు కూడా ఇంటికి చేరుకోక‌పోవ‌డం, ఫోన్ స్విచ్ఛాప్ రావ‌డంపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందారు. అధికార పార్టీని ఉద్దేశించి ప‌లు క‌థ‌నాలు రాసినందునే ఆయ‌న్ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశార‌ని, ఏదైనా హాని త‌ల‌పెట్ట‌వ‌చ్చంటూ ఆయ‌న స్నేహితులు, ప‌త్రికా విలేఖ‌రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే త‌న‌కు సంబంధం లేని కేసు విష‌యంలో జూబ్లిహిల్స్ పోలీసులు పొర‌బ‌డి త‌న‌ను తీసుకువ‌చ్చారంటూ పాత్రికేయ మిత్రుడికి ఫోన్‌లో తెల‌ప‌డం, త‌న‌కేమీ ఇబ్బంది లేద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News