కరోనా గురించిన అపోహలు… వాటి నిజాలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మొదలైన దగ్గరి నుంచి ఎన్నో అపోహలు ఇంటర్నెట్లో రచ్చ చేస్తున్నాయి. వీటిని చదివిన సున్నిత మనస్కులు పాపం ఎక్కడలేని భయాలతో ఆందోళన చెందుతున్నారు. తద్వారా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ సందర్భంగా వైరల్ అవుతున్న కొన్ని అపోహలు, వాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నిజాలను తెలుసుకుందాం. 1. కొవిడ్ 19కి లైసెన్స్ పొందిన మందులు ఉన్నాయి కరోనాను తగ్గించడానికి లైసెన్స్ పొందిన మందులు ఉన్నాయని ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు […]

Update: 2020-05-04 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మొదలైన దగ్గరి నుంచి ఎన్నో అపోహలు ఇంటర్నెట్లో రచ్చ చేస్తున్నాయి. వీటిని చదివిన సున్నిత మనస్కులు పాపం ఎక్కడలేని భయాలతో ఆందోళన చెందుతున్నారు. తద్వారా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ సందర్భంగా వైరల్ అవుతున్న కొన్ని అపోహలు, వాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నిజాలను తెలుసుకుందాం.

1. కొవిడ్ 19కి లైసెన్స్ పొందిన మందులు ఉన్నాయి

కరోనాను తగ్గించడానికి లైసెన్స్ పొందిన మందులు ఉన్నాయని ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో నిజం లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కరోనా ట్రీట్‌మెంట్ కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్, రెమ్డేసివిర్ వాడుతున్నప్పటికీ అవి కేవలం ఉపశమనం కోసమే కానీ నయం చేయడానికి కాదని స్పష్టం చేసింది. కాకపోతే కరోనా మందు కనిపెట్టడానికి అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం.

2. మిరియాలపొడితో కరోనా తగ్గుతుంది.

ప్రస్తుతానికి కరోనాను వ్యాపించకుండా చేయగలగడం మాత్రమే మానవులు చేయగలిగిన పని. అది కూడా సామాజిక దూరం పాటించడం, ముక్కుకు మాస్క్ ధరించడం వల్ల మాత్రమే సాధ్యం. అంతేగానీ మిరియాల పొడి తినడం, డెట్టాల్ లైజాల్ తాగడం, మిథానల్ తాగడం వంటి వాటి వల్ల కరోనా తగ్గదు.

3. కొవిడ్ 19 ఈగలు, దోమల ద్వారా వ్యాపిస్తుంది.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం దీనికి సంబంధించి ఎలాంటి రుజువు లేదు. వ్యాధిగ్రస్తుని తుమ్ము దగ్గు వల్ల, ప్రత్యక్ష తాకిడి వల్ల మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటివరకు తేలింది. అంతేతప్ప ఈగలు, దోమల వల్ల కరోనా రాదు.

4. 25 డిగ్రీల వేడిలో ఉంటే వైరస్ రాదు

వాతావరణం ఎంత వేడిగా ఉన్నా, ఎంత చల్లగా ఉన్నా వైరస్‌కి ఇదేం సంబంధం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే మాత్రమే వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

5. ఒక్కసారి కరోనా వస్తే జీవితాంతం ఉంటుంది.

కరోనా వ్యాపించిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నప్పటికీ అతనిలో వైరస్ ఇంకా బతికే ఉంటుందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. ఒకసారి వైరస్ పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత మళ్లీ బయటి నుంచి వ్యాపిస్తే తప్ప లోలోపల ఉండే అవకాశమే లేదని స్పష్టం చేసింది.

Tags – corona, myths, facts, covid, virus, pandemic

Tags:    

Similar News