అసలు విషయం దాచి.. అందర్నీ రిస్కులో పడేసి!
దిశ ప్రతినిధి, ఖమ్మం : కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దాచిన ఓ వ్యక్తి అందర్నీ రిస్కులో పడేశాడు. ఈ ఘటన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కరోనా సోకిన రోగి ఎవరికీ విషయం చెప్పకుండా సాధారణ రోగుల మధ్య ఐసీయూలో చికిత్స తీసుకున్నాడు. ఈ విషయాన్ని వైద్యులు ఆలస్యంగా గుర్తించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బందికి అనుమానం రాగా ఈ రోజు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. విషయం […]
దిశ ప్రతినిధి, ఖమ్మం :
కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దాచిన ఓ వ్యక్తి అందర్నీ రిస్కులో పడేశాడు. ఈ ఘటన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కరోనా సోకిన రోగి ఎవరికీ విషయం చెప్పకుండా సాధారణ రోగుల మధ్య ఐసీయూలో చికిత్స తీసుకున్నాడు. ఈ విషయాన్ని వైద్యులు ఆలస్యంగా గుర్తించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బందికి అనుమానం రాగా ఈ రోజు పరీక్షలు నిర్వహించారు.
రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. విషయం తెలిసిన వెంటనే అతడితో పాటు ఐసీయూలో ఉన్న ఇద్దరు సాధారణ రోగులతో పాటు 11 మంది సిబ్బందిని హో క్వారంటైన్‌కు ఆదేశించినట్లు భద్రాచలం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ యుగంధర్ తెలిపారు. కరోనా వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో తనకు ఇదివరకే చేయించుకున్న టెస్టుల్లో పాజిటివ్ వచ్చిందని ఆ వ్యక్తి చెప్పడం గమనార్హం. అతని మాటలు విన్న సిబ్బంది షాక్ అవ్వడమే కాదు… భయాందోళనకు కూడా గురయ్యారు.