ఎమ్మెల్యే వ‌న‌మా ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం..

దిశ, కొత్త‌గూడెం: కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. దీనిపై ఎమ్మెల్యే త‌న‌యుడు రాఘవ శుక్ర‌వారం స్వ‌యంగా మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కొద్ది రోజుల క్రితం వ‌న‌మా కుటుంబ స‌భ్యులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఎమ్మెల్యే స‌తీమ‌ణి, కోడ‌లు, మ‌నుమ‌రాలు, ఇంటి వంట మ‌నిషితో పాటు ఎమ్మెల్యే పీఏకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలిపారు. అయితే ఎమ్మెల్యే భార్య‌కు, చిన్న‌కూతురుకు ముందు నెగ‌టివ్ రాగా జూలై 26న చేసిన ప‌రీక్ష‌ల్లో […]

Update: 2020-07-31 12:16 GMT

దిశ, కొత్త‌గూడెం: కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. దీనిపై ఎమ్మెల్యే త‌న‌యుడు రాఘవ శుక్ర‌వారం స్వ‌యంగా మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కొద్ది రోజుల క్రితం వ‌న‌మా కుటుంబ స‌భ్యులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఎమ్మెల్యే స‌తీమ‌ణి, కోడ‌లు, మ‌నుమ‌రాలు, ఇంటి వంట మ‌నిషితో పాటు ఎమ్మెల్యే పీఏకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలిపారు.

అయితే ఎమ్మెల్యే భార్య‌కు, చిన్న‌కూతురుకు ముందు నెగ‌టివ్ రాగా జూలై 26న చేసిన ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. అలాగే మూడో ప‌ర్యాయంగా జూలై 31 నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో త‌న‌కు కూడా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు రాఘ‌వ తెలిపారు. ఇక ఎమ్మెల్యేను క్వారంటైన్‌లో కొన‌సాగాల్సిందిగా వైద్యులు సూచించార‌ని తెలిపారు. దీంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్ట‌ర్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నార‌ని తెలిపారు. అంద‌రి ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఎలాంటి కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు ఫోన్లో అందుబాటులో ఉంటామ‌ని ఆయ‌న తెలిపారు.

Tags:    

Similar News