కరోనా వైరస్ @ 5.5 లక్షల కేసులు

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విశ్వవ్యాపితమైంది. 200 దేశాలకు ఈ వైరస్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య సుమారు ఐదున్నర లక్షల చేరినట్టు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా దాదాపు 25వేల మంది ప్రాణాలు వదిలారు. అమెరికాలో 86వేల కేసులు.. చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ అటు తరువాత సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, స్పెయిన్ లపై పంజా […]

Update: 2020-03-27 08:03 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విశ్వవ్యాపితమైంది. 200 దేశాలకు ఈ వైరస్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య సుమారు ఐదున్నర లక్షల చేరినట్టు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా దాదాపు 25వేల మంది ప్రాణాలు వదిలారు.

అమెరికాలో 86వేల కేసులు..

చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ అటు తరువాత సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, స్పెయిన్ లపై పంజా విసిరింది. దక్షిణ కొరియా ఈ వైరస్ ను కట్టడి చేసినా ఇరాన్, ఇటలీ, స్పెయిన్ లు ఇప్పటికీ విలవిల్లాడుతున్నాయి. చైనా తర్వాత ఈ వైరస్ కేరాఫ్ గా యూరప్ మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వైరస్ అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తున్నది. నేడు ప్రపంచంలో అత్యధిక కేసులు(85,996) అమెరికాలోనే ఉన్నాయి. స్థూలంగా చెప్పుకుంటే అమెరికా(సుమారు 86,000), చైనా(81,897), ఇటలీ(80,589)లోనే ప్రపంచంలోని సగం కేసులు రిపోర్ట్ అయ్యాయి.

స్పెయిన్ లో సింగిల్ డే.. 769మంది మృతి

స్పెయిన్ లో 24 గంటల్లోనే 769 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 4858కి చేరింది. అంటే దాదాపు 20 శాతం మరణాలు సంభవించాయి. ఒక్కరోజులోనే ఈ దేశంలో కరోనా కేసుల సంఖ్య సుమారు 56 వేల నుంచి 64, 059కి పెరిగింది. ఈ దేశ ప్రభుత్వం చైనా ఉత్పత్తి చేసిన దాదాపు తొమ్మిది వేల కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను ఉపసంహరించుకుంది. ఈ టెస్టింగ్ కిట్లు కేవలం 30 శాతం కచ్చితత్వాన్ని కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఇరాన్ లో ఒక్కరోజులోనే 144 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరాన్ లో మృతుల సంఖ్య 2,378కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,926 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,332 కి పెరిగింది.

ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ అలాగే కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 8,215 మంది మరణించారు. ఒక్కరోజులోనే సుమారు 700లకు పైగా మృతి చెందారు.

మేం కలిశాం..

కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి పారదోలేందుకు రెండు సూపర్ పవర్ దేశాలు అమెరికా, చైనా ఐక్యంగా పోరాడాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. ఈ వ్యాఖ్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఫలప్రదమైన చర్చ జరిగిందని, కరోనా వైరస్ గురించి సమగ్ర విషయాలు పంచుకున్నారని తెలిపారు.

Tags : Coronavirus, across the globe, IS, Italy, death toll, spread, contains

Tags:    

Similar News