ఏపీలో కరోనా @ 25,422
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజూ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజూ గత రోజు కంటే వంద నుంచి రెండు వందల అదనపు కేసులు నమోదవుతుండడంతో కరోనా కట్టడి సాధ్యమవుతుందా? అన్నది అంతుపట్టడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన వారు 1576 మందికి సోకగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 32 మందికి కరోనా సోకింది. […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజూ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజూ గత రోజు కంటే వంద నుంచి రెండు వందల అదనపు కేసులు నమోదవుతుండడంతో కరోనా కట్టడి సాధ్యమవుతుందా? అన్నది అంతుపట్టడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన వారు 1576 మందికి సోకగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 32 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 981 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 25,422 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 11936 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 13,194 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24గంటల్లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 292 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.