రాష్ట్రంలో ఇవాళ 4,305 కేసులు, 29 మరణాలు

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్టులను శుక్రవారం 57,416 మందికి నిర్వహించగా వీరిలో 4,305 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 54,832కి చేరుకుంది. ఒక రోజులో 29 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 2,896కి చేరుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 607, భద్రాద్రి కొత్తగూడెంలో 130, జనగాంలో 63 జగిత్యాలలో 125, జయశంకర్ భూపాలపల్లిలో 76, జోగుళాంబ గద్వాలలో 71, కరీంనగర్‌లో 229, ఖమ్మంలో 222, మహబూబ్‌నగర్‌లో 137, […]

Update: 2021-05-14 10:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్టులను శుక్రవారం 57,416 మందికి నిర్వహించగా వీరిలో 4,305 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 54,832కి చేరుకుంది. ఒక రోజులో 29 మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 2,896కి చేరుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 607, భద్రాద్రి కొత్తగూడెంలో 130, జనగాంలో 63 జగిత్యాలలో 125, జయశంకర్ భూపాలపల్లిలో 76, జోగుళాంబ గద్వాలలో 71, కరీంనగర్‌లో 229, ఖమ్మంలో 222, మహబూబ్‌నగర్‌లో 137, మహబూబాబాద్‌లో 94, మంచిర్యాలలో 139, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 291, ములుగులో 51, నాగర్‌కర్నూల్‌లో 143, నల్గొండలో 246, నిజామాబాద్‌లో 82, పెద్దపల్లిలో 134, రాజన్నసిరిసిల్లాలో 71, రంగారెడ్డిలో 293, సంగారెడ్డిలో 111, సిద్దిపేటలో 169, వికారాబాద్‌లో 158, వనపర్తిలో 110, వరంగల్ రూరల్‌లో 122, వరంగల్‌ అర్బన్‌లో 128, యాదాద్రి భువనగిరిలో 75 కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 34, కామారెడ్డిలో 36, కొమరంభీం ఆసీఫాభాద్‌లో 29, మెదక్ లో 47, నారాయణపేట లో 26, నిర్మల్‌లో 25, సూర్యపేటలో 31 కేసులు నమోదయ్యాయి. గురువారం (మే 13న) మొత్తం 39,555 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టగా వీరిలో మొదటి డోసు వ్యాక్సిన్ ను 1,045 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 38,510 మందికి అందించారు. ఇప్పటి వరకు మొత్తం మొదటి డోసు వ్యాక్సిన్ ను 43,75,396 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్‌ను 11,03,0872 మందికి అందించారు.

Tags:    

Similar News