14 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కేసుల సంఖ్య 14 లక్షలకు చేరువయ్యేలా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 48,661 కొత్త కేసులు నమోదయ్యాయి. 705 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 13 లక్షల 85,522 కు చేరుకుంది. ఇందులో 8 లక్షల 65 వేల 577 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల […]

Update: 2020-07-25 23:16 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కేసుల సంఖ్య 14 లక్షలకు చేరువయ్యేలా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 48,661 కొత్త కేసులు నమోదయ్యాయి. 705 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 13 లక్షల 85,522 కు చేరుకుంది.

ఇందులో 8 లక్షల 65 వేల 577 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 లక్షల 67, 882 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32,062 మంది బాధితులు కరోనా సోకి మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల కరోనా టెస్టులు, గడిచిన 24 గంటల్లో 4.42 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Tags:    

Similar News