ఇల్లే.. కరోనా వల్లే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. విదేశాల్లో అయితే మాత్రం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఎందుకంటే.. అక్కడ దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశవాసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. కనీస అవసరాలకు కూడా బయటకు రావడంలేదు. వైరస్ బారిన పడకుండా ఇంటిలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. అమెరికాలో […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. విదేశాల్లో అయితే మాత్రం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఎందుకంటే.. అక్కడ దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశవాసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. కనీస అవసరాలకు కూడా బయటకు రావడంలేదు. వైరస్ బారిన పడకుండా ఇంటిలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే.. అమెరికాలో కరోనా భారీగా విజృంభిస్తోంది. పలువురు మృత్యువాతపడ్డారు. చాలామంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కరోనా బారిన పడకుండా పలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. అంతేకాదు ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమను ఏ రూపంలో మృత్యు ఒడిలోకి తీసుకెళ్తుందోనని భయపడుతున్నారు. దీంతో ఆ వ్యాధి బారిన పడకుండా పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అసలు ఇంటి నుంచి కూడా కాలు బయటపెట్టడంలేదు. అంతెందుకు కనీసం నిత్యవసర వస్తువులు కూడా ఇలా ఒకేసారి తెచ్చుకుని ఇంటిలో పెట్టుకుంటున్నారు. అది కూడా ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు. దీంతో ఇల్లు నిండా ఎక్కడా చూసినా కూడా వస్తువులే కనిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అది ఇళ్లా?.. లేక గోడౌనా ? అర్థంకావడంలేదు. సుమారు నెలల వరకు సరిపడే విధంగా సరుకులు ముందుగా తెచ్చిపెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఎంత కష్టకాలమొచ్చిందోననేది ఇట్టే అర్థమవుతోంది.
tags : coronavirus, American house full, Essential items, Various precautions