యాదాద్రి జిల్లాలో గర్భిణికి కరోనా

దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి ఏ రూపంలో ఎవరి దరి చేరుతుందో తెలియడంలేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఇప్పటికే ఆ మహమ్మారి కోరలకు చిక్కి చికిత్స పొందుతున్నారు. అందులో కొంతమంది మృతిచెందగా, మిగతావాళ్లు చికిత్స పొంది మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఆఖరికి గర్భిణులను కూడా ఈ భయంకరమైన భూతం ఇబ్బందులకు గురి చేస్తోన్నది. తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన ఓ వలస కూలీ అయిన గర్భిణికి కరోనా […]

Update: 2020-05-16 03:50 GMT

దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారి ఏ రూపంలో ఎవరి దరి చేరుతుందో తెలియడంలేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఇప్పటికే ఆ మహమ్మారి కోరలకు చిక్కి చికిత్స పొందుతున్నారు. అందులో కొంతమంది మృతిచెందగా, మిగతావాళ్లు చికిత్స పొంది మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఆఖరికి గర్భిణులను కూడా ఈ భయంకరమైన భూతం ఇబ్బందులకు గురి చేస్తోన్నది. తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన ఓ వలస కూలీ అయిన గర్భిణికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి అయిన సదరు మహిళ.. కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం స్వచ్ఛందంగా బీబీనగర్ ఎయిమ్స్ లోని క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. వారికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Tags:    

Similar News