భారత్‌లో తొలి కరోనా మరణం

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఉత్తర కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధఖీ(76) కరోనాతో బాధపడుతూ బుధవారం మరణించారు. ఈ విషయాన్ని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బీ. శ్రీరాములు గురువారం వెల్లడించారు. గత జనవరిలో సిద్దఖీ సౌదీ అరేబియాకు వెళ్లి ఫ్రిబవరిలో తిరిగి వచ్చారు. తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఈ నెల4న గుల్బర్గాలోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. కోలుకోలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి ఆంబులెన్స్‌లో తరలించారు. అయితే […]

Update: 2020-03-12 20:06 GMT

భారత్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఉత్తర కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధఖీ(76) కరోనాతో బాధపడుతూ బుధవారం మరణించారు. ఈ విషయాన్ని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బీ. శ్రీరాములు గురువారం వెల్లడించారు. గత జనవరిలో సిద్దఖీ సౌదీ అరేబియాకు వెళ్లి ఫ్రిబవరిలో తిరిగి వచ్చారు. తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఈ నెల4న గుల్బర్గాలోని ఓ ఆసుప్రతిలో చేర్పించారు. కోలుకోలేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి ఆంబులెన్స్‌లో తరలించారు. అయితే కరోనా సోకిందని అనుమానించిన వైద్యులు, గాంధీకి తరలించాలని సూచించారు. అయితే అతని కుటుంబ సభ్యులు తిరిగి గుల్బర్గాకు తరలించారు. మంగళవారం గుల్బర్గా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ వైద్యులు బాధితుని నుంచి నమూనాలు సేకరించి, బెంగళూర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. బాధితుడు బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బాధితుడికి సంబంధించిన రిపోర్ట్‌లు గురువారం సాయంత్రం వచ్చాయి. అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

tag; corona, first death, gulbarga, karnataka

Tags:    

Similar News