బ్రేకింగ్: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరగాల్సిన అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లు, రాజకీయ నాయకుల పర్యటనలు, పలు ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. శనివారం రాత్రే ఆలయాన్ని ముసివేసినట్టుగా ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 22 వరకూ ఆలయంలోకి ఎవరినీ ప్రవేశించబోరని స్పష్టం చేశారు. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరగాల్సిన అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లు, రాజకీయ నాయకుల పర్యటనలు, పలు ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. శనివారం రాత్రే ఆలయాన్ని ముసివేసినట్టుగా ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 22 వరకూ ఆలయంలోకి ఎవరినీ ప్రవేశించబోరని స్పష్టం చేశారు. కాగా, గతంలో 1980లో కలరా వ్యాపించడంతో ఆ సమయంలో 40 రోజులపాటు రాజన్నగుడిని మూసివేశారని స్థానికంగా అక్కడ చర్చించుకుంటున్నారు. ఇక ఆలయం మూసివేయడంతో భక్తులు లేక ఆలయం వేలవేలబోతుంది.