ఖండాంతరాలు దాటిన దీక్ష దివాస్
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక మలుపు తిప్పి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు నవంబర్ 29.
దిశ, గోదావరిఖని : స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక మలుపు తిప్పి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రోజు నవంబర్ 29. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడోనని నినదించి 11 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రోజును స్మరించుకుంటూ ఖండంతరాలు దాటి అమెరికాలో వృత్తి రీత్యా స్థిరపడిన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంకు చెందిన బీఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో అమెరికాలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు పాల్గొని దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆనాటి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ తెలంగాణలో మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, కేసీఆర్ దీక్ష స్ఫూర్తిగా మరోసారి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలని తెలంగాణ కార్యకర్తకు సూచించారు. రాబోయే నాలుగేళ్లు ప్రజల కోసం పోరాటం చేయాలని, ప్రతి వేదికలో తెలంగాణ పక్షాన పోరాడాలని వారు కోరారు.