'వకీల్ సాబ్' ని కరోనా కరుణిస్తుందా..?
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో వెండి తెర మీద కనిపిస్తున్నాడు. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ , టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలని నమోదు చేసింది. ఇక ఈరోజు విడుదలవుతున్న ట్రైలర్ కోసం అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఏప్రిల్ 9 […]
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో వెండి తెర మీద కనిపిస్తున్నాడు. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ , టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలని నమోదు చేసింది. ఇక ఈరోజు విడుదలవుతున్న ట్రైలర్ కోసం అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంది.
ఏప్రిల్ 9 న విడుదల కానున్న ఈ చిత్రంపై అటు అభిమానులలోనూ, ఇటు డిస్ట్రిబ్యూటర్లలోను చెప్పుకోలేని ఒక అనుమానం తొలుస్తూ ఉంది. అదే .. కరోనా. ఇప్పటీకే ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలం అయ్యింది. గతేడాది నుండి కుదేలయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు సైతం థియేటర్లును మూతపడకుండా చేసాయి. ఇక ఇవన్నీ మంచి విషయాలే అయినా.. కొన్ని ఆలోచించాల్సిన విషయాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. ముందు ముందు కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉందని అధికారులు తెలుపుతున్నారు. కొన్ని చోట్ల లాక్ డౌన్ లు కూడా పెట్టేసారు. ఇక ఇప్పటీకే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ మొదలయిపోయాయి కూడా.. మరి ఈ నేపథ్యంలో కరోనా ను దాటుకొని ప్రేక్షకులు థియేటర్ల వైపు వస్తారా? అనేది తేలాల్సిన పెద్ద ప్రశ్న.
ఓపెనింగ్ లెక్కలతోనే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుందా? కరోనా లేకుండా అంతా సవ్యంగా జరిగితే మొదటి వారానికే 50 శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకురాగల సత్తా పవన్ కళ్యాణ్ కి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడులు, బడులు మూసివేస్తున్నవేళ ఈ చిత్రం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వగలదా? భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ విడుదలైన మొదటి వారంలోనే హిట్ టాక్ అందుకొని సేఫ్ జోన్ కి వెళ్తే తప్ప థియేటర్లు బారులు తీరవు. మరి ఇన్ని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు కరోనా సహకరిస్తోందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది.