జీఐశాట్ 1 లాంచింగ్ మీద లాక్‌డౌన్ ప్రభావం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావం భారత అంతరిక్ష రంగం మీద కూడా పడింది. జీఎస్ఎల్వీ ఎఫ్10 ద్వారా పంపించనున్న జీఐశాట్1 లాంచింగ్‌ను భారత అంతరిక్ష కేంద్రం మార్చి 5న నిర్ణయించింది. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల లాంచింగ్‌ని ఏప్రిల్ నెలకి పొడిగించింది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా దీని లాంచింగ్‌ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచింగ్ డేట్‌ను త్వరలో ఇస్రో ప్రకటించనున్నట్లు సమాచారం. శాటిలైట్ లాంచింగ్ కొరకు […]

Update: 2020-04-09 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావం భారత అంతరిక్ష రంగం మీద కూడా పడింది. జీఎస్ఎల్వీ ఎఫ్10 ద్వారా పంపించనున్న జీఐశాట్1 లాంచింగ్‌ను భారత అంతరిక్ష కేంద్రం మార్చి 5న నిర్ణయించింది. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల లాంచింగ్‌ని ఏప్రిల్ నెలకి పొడిగించింది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా దీని లాంచింగ్‌ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచింగ్ డేట్‌ను త్వరలో ఇస్రో ప్రకటించనున్నట్లు సమాచారం.

శాటిలైట్ లాంచింగ్ కొరకు కనీసం వెయ్యి మంది పనిచేయాల్సిన అవసరం ఉందని, కొవిడ్ 19 నేపథ్యంలో అలాంటి రిస్కు తీసుకోవడానికి ఇస్రో సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్ నుంచి లాంచ్ చేయాల్సి ఉంది. జీఐశాట్ 1 శాటిలైట్ అనేది ఒక ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్. ఇది ఏడేళ్ల పాటు చేయనున్నది. దీనిలో ఉన్న మల్టీహైపర్ స్పెక్ట్రల్ ఇమేజరీ, రిట్చే క్రెటిన్ టెలిస్కోప్ ద్వారా భూమిని అబ్జర్వ్ చేసి, హై రెజల్యూషన్ ఇమేజ్‌లను పంపిస్తుంది. వ్యవసాయం, అటవీ, మినరాలజీ, విపత్తు నిర్వహణల్లో ఉపయోగానికి ఈ శాటిలైట్ పంపించనున్నారు.

Tags : corona, Covid 19, Technology, Sriharikota, hd images, GISAT 1

Tags:    

Similar News