2 లక్షల లడ్లు మిగిలిపోయాయి

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలంటే చెవికోసుకోని వెంకన్న భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తిరుపతి లడ్డూకి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే చాలు.. మాకో లడ్డూ తెచ్చిపెట్టవా? అని అడుగుతుంటారు. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రోజూ లక్షల సంఖ్యలో లడ్డూలను టీటీడీ తయారు చేస్తుంది. ఈ లడ్డూల్లో ప్రతి రోజూ స్వామి వారి దర్శనానంతరం భక్తులకు ఒకటి ఉచితంగా ఇస్తారు. ఎవరికైనా అదనంగా కావాలంటే కొనుక్కోవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో శ్రీవారి […]

Update: 2020-03-21 04:45 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలంటే చెవికోసుకోని వెంకన్న భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. తిరుపతి లడ్డూకి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే చాలు.. మాకో లడ్డూ తెచ్చిపెట్టవా? అని అడుగుతుంటారు. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రోజూ లక్షల సంఖ్యలో లడ్డూలను టీటీడీ తయారు చేస్తుంది.

ఈ లడ్డూల్లో ప్రతి రోజూ స్వామి వారి దర్శనానంతరం భక్తులకు ఒకటి ఉచితంగా ఇస్తారు. ఎవరికైనా అదనంగా కావాలంటే కొనుక్కోవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో స్వామి వారి దర్శనానికి బ్రేక్ పడింది. శ్రీవారి కైంకర్యాలు జరుగుతుండడంతో ఇతర సౌకర్యాలను నిరాటంకంగా సాగిస్తోంది. అయితే ముందుచూపుతో తయారు చేసిన 2 లక్షల లడ్డూలు మాత్రం మిగిలిపోయాయి.

తిరిగి ఆలయంలోకి భక్తుల ప్రవేశం మొదలైతే కానీ ఈ లడ్డూలు వినియోగంలోకి రావు. దీంతో వీటిని ఉగాది కానుకగా టీటీడీ సిబ్బందికి పంచాలని దేవస్థానం నిర్ణయించింది. టీటీడీలో సుమారు 16 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆలయంలో అర్చకులతో పాటు వివిధ కార్యక్రమాల్లో, వివిధ విభాగాల ద్వారా పాలుపంచుకునే సిబ్బంది మొత్తానికి లడ్డూలు పంచనున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమల కాటేజీల్లో శ్మశాన వైరాగ్యం తాడవిస్తోంది. వీధులన్నీ బోసిపోయాయి. బస్సులన్నీ చలనం లేనట్టు నిలిచిపోయాయి. సిబ్బంది తప్ప ఇతరులెవరూ కనిపించడం లేదు. దగ్గినా, తుమ్మినా అంతా అనుమానంగా చూస్తున్నారు.

Tags : tirumala tirupati devasthanam, ttd, laddu, devotees, employees

Tags:    

Similar News