వెయ్యి దాటిన డిశ్చార్జిలు.. కొత్తగా 41 కేసులు

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ర్టంలో కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి బయటపడిన వారి సంఖ్య వెయ్యి దాటింది. కరోనా డిశ్చార్జిల సంఖ్య 1,002కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో సోమవారం ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసులు 1,592 నమోదు కాగా.. 1,002 మంది డిశ్చార్జి కావడం గమనార్హం. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 26, మేడ్చల్ జిల్లాలో మూడు, వలస కార్మికుల్లో 12 మందిలో మొత్తం 41 మందికి పాజిటివ్ […]

Update: 2020-05-18 12:06 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ర్టంలో కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి బయటపడిన వారి సంఖ్య వెయ్యి దాటింది. కరోనా డిశ్చార్జిల సంఖ్య 1,002కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో సోమవారం ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా కేసులు 1,592 నమోదు కాగా.. 1,002 మంది డిశ్చార్జి కావడం గమనార్హం. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 26, మేడ్చల్ జిల్లాలో మూడు, వలస కార్మికుల్లో 12 మందిలో మొత్తం 41 మందికి పాజిటివ్ వచ్చింది. కొత్తగా పాజిటివ్ వచ్చిన 12 మందితో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వలస కార్మికుల సంఖ్య 69కి చేరింది. కరోనా కేసుల్లో చికిత్స పొందుతూ సోమవారం పదిమంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,002 కాగా.. 556 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా 34 మంది మరణించారు.

Tags:    

Similar News