కరోనా మరణం.. పట్టించుకోని బంధువులు

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా మహమ్మారి మనుషుల మధ్య అప్యాయతలను దూరం చేస్తోంది. వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా లేదా మృతి చెందినా కడసారి చూపునకు కూడా బాధితులు నోచుకోవడం లేదు. మృతదేహాన్ని తీసుకెళ్లినా లేక అంత్యక్రియల్లో పాల్గొన్నా ఆ మహమ్మారి తమకు ఎక్కడ సోకుతుందేమోనని అయిన వాళ్లే భయపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం వెలుగుచూసింది. క‌రోనా బారిన పడి భ‌ద్రాచ‌లం ఏరియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ణుగూరుకు చెందిన […]

Update: 2020-08-01 07:22 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా మహమ్మారి మనుషుల మధ్య అప్యాయతలను దూరం చేస్తోంది. వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా లేదా మృతి చెందినా కడసారి చూపునకు కూడా బాధితులు నోచుకోవడం లేదు. మృతదేహాన్ని తీసుకెళ్లినా లేక అంత్యక్రియల్లో పాల్గొన్నా ఆ మహమ్మారి తమకు ఎక్కడ సోకుతుందేమోనని అయిన వాళ్లే భయపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం వెలుగుచూసింది.

క‌రోనా బారిన పడి భ‌ద్రాచ‌లం ఏరియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ణుగూరుకు చెందిన మ‌హిళ ఈరోజు మృతిచెందింది. అయితే, మృత‌దేహాన్ని తీసుకెళ్ల‌డానికి కుటుంబ స‌భ్యులు , బంధువులు గానీ ముందుకు రాలేదు. దీంతో స్థానిక అధికారుల స‌మ‌క్షంలో మృతురాలి అంత్య‌క్రియ‌లు పూర్తి చేసినట్లు త‌హ‌సీల్దార్ నాగేశ్వ‌ర్‌రావు వెల్లడించారు.

Tags:    

Similar News