యూఎస్ లో మూడు రోజుల్లో రెట్టింపు మరణాలు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా మందిని పొట్టన పెట్టుకుంది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య శనివారం 2,010గా ఉన్నది. కాగా, మూడు రోజుల్లోనే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,076కు చేరినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ దేశంలో అత్యధిక మరణాలు (40 శాతం) న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం. మంగళవారం నాడు అమెరికాలో కరోనా మృతుల సంఖ్య చైనాను మించిపోయాయి. […]
వాషింగ్టన్: అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా మందిని పొట్టన పెట్టుకుంది. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య శనివారం 2,010గా ఉన్నది. కాగా, మూడు రోజుల్లోనే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,076కు చేరినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ దేశంలో అత్యధిక మరణాలు (40 శాతం) న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం. మంగళవారం నాడు అమెరికాలో కరోనా మృతుల సంఖ్య చైనాను మించిపోయాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు(189,510) అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇటలీ, స్పెయిన్ లలో చోటుచేసుకున్నాయి.
Tags : Coronavirus, world, is, worst, deaths, double