వార్డులోనే 6గంటలకు పైగా కరోనా శవం.. చోద్యం చూస్తున్న వైద్యులు.. ఎక్కడంటే?
దిశ ప్రతినిది, కరీంనగర్: జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి సజీవ సాక్షంగా నిలిచింది ఈ ఘటన. కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆదివారం ఉదయం కరోనాతో ఒకరు మృతి చెందినా శవాన్ని తరలించే విషయంలో ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేసింది. మా అంబులెన్సులు లేవని వచ్చే వరకు వేచి ఉండాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మృతుని బంధువులు ఆవేదన […]
దిశ ప్రతినిది, కరీంనగర్: జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి సజీవ సాక్షంగా నిలిచింది ఈ ఘటన. కరోనా సోకి మృతి చెందిన వ్యక్తి పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆదివారం ఉదయం కరోనాతో ఒకరు మృతి చెందినా శవాన్ని తరలించే విషయంలో ఎవరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేసింది. మా అంబులెన్సులు లేవని వచ్చే వరకు వేచి ఉండాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి మరణించి ఆరు గంటలు దాటినా ఆసుపత్రి సార్లు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.