కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్య…
దిశా, కోదాడ: తనకు తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. కోదాడ పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణంలోని సాయికృష్ణ ధియేటర్‌సమీపంలో నివాసముంటున్న గునుగుంట్ల నవీన్‌కుమార్ (28) నల్లొండ జిల్లా నిడమనూరులో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతడు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో […]
దిశా, కోదాడ: తనకు తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. కోదాడ పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణంలోని సాయికృష్ణ ధియేటర్‌సమీపంలో నివాసముంటున్న గునుగుంట్ల నవీన్‌కుమార్ (28) నల్లొండ జిల్లా నిడమనూరులో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతడు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో కోదాడలోని ఇంట్లోనే విడిగా హోం ఐసోలేషన్ లో ఉంటున్నాడు.
అయినా జ్వరం తీవ్రత ఎక్కువ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఆదివారం కోదాడ పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్ళిన అతడు చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటి తరువాత చెరువు కట్టపై దుస్తులు, చెప్పులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. తన కుమారుడు అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని నవీన్ కుమార్ తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై క్రాంతి కుమార్‌తెలిపారు.