ఏపీలో ఎన్ని కరోనా కేసులంటే..

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 2,905 కేసులు నమోదు అయ్యాయి. మరో 16 మంది కొవిడ్-19 బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 88,778 మందికి పరీక్షలు చేశారు. ఈ మేరకు గురువారం ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,14,784 మందికి కరోనా సోకింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6,659 మందికి చేరింది. […]

Update: 2020-10-29 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 2,905 కేసులు నమోదు అయ్యాయి. మరో 16 మంది కొవిడ్-19 బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 88,778 మందికి పరీక్షలు చేశారు. ఈ మేరకు గురువారం ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,14,784 మందికి కరోనా సోకింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6,659 మందికి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,243 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,84,752కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,268 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 78,62,459 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

Tags:    

Similar News