భారత్‌లో కరోనా@2లక్షలు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మంగళవారం సాయంత్రానికి మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువయ్యాయి. ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,98,706కి చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో 204 మంది మరణించగా, దేశవ్యాప్తంగా 5,598 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరణాల శాతం మొత్తం కేసుల్లో […]

Update: 2020-06-02 11:25 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. మంగళవారం సాయంత్రానికి మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువయ్యాయి. ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,98,706కి చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో 204 మంది మరణించగా, దేశవ్యాప్తంగా 5,598 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరణాల శాతం మొత్తం కేసుల్లో 2.82 శాతంగా ఉంది. కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ 7వ స్థానంలో కొనసాగుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 95,526 డిశ్చార్జి కాగా 97,581 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. కరోనా కేసులు చైనాతో పోలిస్తే మూడు రెట్లు అధికమయ్యే దిశగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది.మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ రోజు మహారాష్ట్రలో ఒక్కరోజే 2,287పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 72,300కి చేరింది. మహారాష్ట్రలో గడిచిన 17 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ ఒక్కరోజులోనే 103 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,465కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,109 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 41,986కు చేరింది. ముంబైలో కొత్తగా 49 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, నగరంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,368కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 1,091 కొత్త కేసులు నమోదవగా, ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 24,586కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 13 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 197కి చేరింది.గుజరాత్‌లో ఒక్కరోజే 415 కొత్త కేసులు నమోదవగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య17,632కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 29మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఆ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,092కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 115 కరోనా పాజిటివ్‌ వచ్చాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,791కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 927 యాక్టివ్ కేసులున్నాయి.

Tags:    

Similar News