తెలంగాణ పోలీసుశాఖలో కరోనా టెన్షన్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసుశాఖలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా సోకగా వారందరూ హోం క్వారంటైన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సైతం ఓ ఉద్యోగికి కరోనా రాగా, తన కింద పనిచేసే సహయకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో డీజీ స్థాయి అధికారి హోంక్వారంటైన్‌కు వెళ్లినట్టు సమాచారం. కేవలం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే 26 కరోనా కేసులు వెలుగుచూడగా, జీహెచ్ ఎంసీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 180మంది […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసుశాఖలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా పలువురు ఐపీఎస్ అధికారులకు కరోనా సోకగా వారందరూ హోం క్వారంటైన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సైతం ఓ ఉద్యోగికి కరోనా రాగా, తన కింద పనిచేసే సహయకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో డీజీ స్థాయి అధికారి హోంక్వారంటైన్‌కు వెళ్లినట్టు సమాచారం. కేవలం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే 26 కరోనా కేసులు వెలుగుచూడగా, జీహెచ్ ఎంసీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 180మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది.దీంతో వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందజేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసు శాఖలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో డ్యూటీ చేసేందుకు పలువురు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.