ఆందోళనకరం.. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ భారీస్థాయిలో వైరస్ వ్యాప్తి లేకపోవడం ప్రజల్లో ఆందోళనను తగ్గించే చాన్స్ ఉంది. తాజాగా విడుదలైన నేషనల్ హెల్త్ బులెటిన్ ఈ విషయాన్ని స్పష్టంచేస్తుంది. మొన్నటివరకు 30 వేల నుంచి 40వేల మధ్యలో నమోదైన కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో కొత్తగా 41,157 కరోనా కేసులు వెలుగుచూడగా, 518 మరణాలు సంభవించాయి. నలభై వేలను దాటి కరోనా […]

Update: 2021-07-17 23:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ భారీస్థాయిలో వైరస్ వ్యాప్తి లేకపోవడం ప్రజల్లో ఆందోళనను తగ్గించే చాన్స్ ఉంది. తాజాగా విడుదలైన నేషనల్ హెల్త్ బులెటిన్ ఈ విషయాన్ని స్పష్టంచేస్తుంది. మొన్నటివరకు 30 వేల నుంచి 40వేల మధ్యలో నమోదైన కరోనా కేసులు.. గడచిన 24 గంటల్లో కొత్తగా 41,157 కరోనా కేసులు వెలుగుచూడగా, 518 మరణాలు సంభవించాయి.

నలభై వేలను దాటి కరోనా కేసులు పెరుగుతుండటం మరోసారి ప్రజల అజాగ్రతను సూచిస్తుంది. దేశంలో ప్రస్తుతం 4.22లక్షల యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు దేశంలో 4.49కోట్లకు పైగా వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. ఇదిలాఉండగా, 24 గంటల్లో 42,004 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Tags:    

Similar News